Aug 12,2023 20:12

గోనెగండ్లలో జెండాను ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజశక్తి - ఆదోని
పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఎఐఎస్‌ఎఫ్‌ 88వ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రహ్లాద్‌, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌ నిజామి ఎఐఎస్‌ఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, మండల కార్యదర్శి కలుబావి రాజు, ఎఐటియుసి కార్యనిర్వాక అధ్యక్షులు ఎం.ప్రకాష్‌ మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌.షబీర్‌ బాష, డివిజన్‌ అధ్యక్షులు యు.దస్తగిరి, డివిజన్‌ నాయకులు వీరేష్‌, మల్లికార్జున, లక్ష్మీనారాయణ, వీరేంద్ర, అభిమిత్ర, ప్రభాకర్‌, ఆకాష్‌, నరసింహ, వీరేష్‌, రవి, సుభాన్‌, సోము పాల్గొన్నారు. గోనెగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు గానుగ బాష, రాష్ట్ర సమితి సభ్యులు రంగస్వామి, తాలూకా అధ్యక్షులు మునిస్వామి, సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఆలూరు ఎపి మోడల్‌ స్కూల్‌లో ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు సద్గురు జెండాను ఆవిష్కరించారు. అధ్యాపకులు బాలకృష్ణ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ జిల్లా సమితి సభ్యులు మునిస్వామి, దుర్గా నాయక్‌, చంద్రశేఖర్‌, వెంకటేష్‌ నాయక్‌, దివాకర్‌, రంగనాయకులు పాల్గొన్నారు. కోసిగి సిపిఐ కార్యాలయం ముందు తాలూకా అధ్యక్షులు వీరేష్‌ అధ్యక్షతన ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు ప్రతాప్‌ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథులుగా ఎఐఎస్‌ఎఫ్‌ మాజీ నాయకులు డాక్టర్‌ రాజన్న, ఎం.రాజు, ప్రకాష్‌ హాజరయ్యారు. ఎఐఎస్‌ఎఫ్‌ మండల కార్యదర్శి అంజి, మండల నాయకులు హనుమంతు, దుర్గ, మహేష్‌, మల్లికార్జున, అశోక్‌, రాజు, విజరు పాల్గొన్నారు.