ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
ప్రజాశక్తి-యంత్రాంగం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల ఆ పార్టీ నాయకులు కేక్ కటింగ్‌చేశారు. కలెక్టరేట్ (కృష్ణా) : నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్యర్యంలో పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలు మధ్యన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 23వ డివిజన్ టిడిపి ఆధ్వర్యంలో ముస్తాఖాన్ పేట ఈద్గా దగ్గర పేద ముస్లిం మైనారిటీ ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 27 వ డివిజన్ లో 250 మంది పేదలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం స్థానిక కోనేరు సెంటర్‌లో కొల్లు ఫౌండేషన్ అధ్యర్యంలో కొల్లు ఫౌండేషన్ అధినేత్రి కొల్లు నీలిమ అధ్యక్షతన ప్రయాణికులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. టిడిపి నగర వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం 30,32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చింతగుంట పాలెం ఎస్ టి కాలనీ లో అన్నదానం నిర్వహించారు. 35, 37 వ డివిజన్ల లో రాజుపేట షాదీఖానాలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, గోపు సత్యనారాయణ,ఇలియాస్ షా ష,పిప్పళ్ళ వెంకన్న,కార్పోరేటర్లు రాళ్ళ కొట్టు రాము,దింటకుర్తి సుధాకర్, మరకాని సమత కీర్తి, యశ్వంత్ వర్మ,డివిజన్ ఇంఛార్జి చింత చిన్ని,సుంకర చిన్ని ,సుంకర యేసు,బోయిన రాజు, వడ్లమూడి సుబ్బారావు, నారగాని కష్ణ, , అబ్దుల్ అజిమ్, షేక్ భాజాని, ఫిరోజ్,హసిమ్ బేగ్,సలీం, అమీర్, ఖదీర్,ఆరిఫ్, నాగ అయ్యప్ప, రాయన శివ,సుంకర శ్రీను, నిక్కు రాధాకృష్ణ, వాక భాస్కర్, గోపి, కొడాలి మోషే, సాంబశివరావు, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పమిడిముక్కల : టిడిపి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పమిడిముక్కలలో టిడిపి పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్ల కుమార్ రాజా కేకు కట్ చేశారు. మండల టిడిపి నాయకులు రాజులపాటి శ్రీనివాసరావు, నాదెళ్ల సుబ్రహ్మణ్యం, మర్రివాడ గ్రామ సర్పంచ్ వంపుకడవల ఫ్రాన్సిస్, ఆలీ, కొల్లూరు, బాబ్జి, అబ్బాస్ ఆలీ, జి.శ్రీనివాసరావు, జక్కా శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, లింగమనేని బాబూరావు, కందిమల్ల సుబ్రహ్మణ్యం, ఏడుకొండలు, కొడాలి కోటేశ్వరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గన్నవరం : గన్నవరం టిడిపి అధ్యక్షులు జాస్తి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో పాత గన్నవరంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేకు కట్‌చేశారు. టిడిపి రాష్ట్ర నాయకులు గుండపనేని ఉమావరప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. కోడూరు : కోడూరు మండల టిడిపి ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. మండల టిడిపి అధó్యక్షులు బండే శ్రీనివాసరావు, మాజీ బీసీ చైర్మన్ గుడిసేవ సూర్యనారాయణ, మాజీ డిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు, కోడూరు మండల తెలుగు యువత అధ్యక్షులు బడే గాంధీ, గ్రామ పార్టీ అధ్యక్షులు పూతబోయిన శ్రీనివాసరావు, సోషల్ మీడియా కన్వీనర్ వేములపల్లి రాజేష్, టిడిపి నాయకులు, అద్దంకి పాండురంగారావు, బొలిశెట్టి విట్టల్ రావు, కోరాకుల ప్రసాద్, చింతల రమేష్ , బడే పిచ్చయ్య, పుప్పాల పోతురాజు, కొప్పనాతి సత్యనారాయణ, బొడ్డు వెంకన్న ,బెల్లంకొండ కోటేశ్వరరావు, తోట రాంబాబు, బడే వెంకటరమణ, మల్లాది ప్రసాద్, కాగిత ప్రసాద్, కొండవీటి నాగేశ్వరరావు, వేములపల్లి శ్రీకృష్ణ, మేకా రమేష్, గోలి సాంబశివరావు, దావు చిన్నబాబు, అప్పికట్ల రవీంద్ర,గిరి టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంగుటూరు : మండలంలోని ఇందుపల్లి, మాణికొండ, పెద్దఆవుటపల్లి, తేలప్రోలులో టిడిపి ఉంగుటూరు మండల అధ్యక్షులు డాక్టర్ ఆరుమళ్ళ వెంకట కృష్ణారెడ్డి కేకు కట్‌చేశారు. తేలప్రోలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హనోక్, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కొండేటి ఏడు కొండలు, పార్లమెంటరీ కార్యదర్శి కొండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కిరణ్, గాదిరెడ్డి. మోహన్ రెడ్డి, దుడ్ల కుమార్, నిమ్మకూరి మహేష్, గుడ్డేటి శ్యామ్, అలుగోజి నాగబాబు, సామిరెడ్డి రాము, చౌటపల్లి. రాజ్‌కుమార్, గుల్లిపల్లి సందీప్, లంక సత్య రాజు పాల్గొన్నారు. తోట్లవల్లూరు : తోట్లవల్లూరు మండలంలో టిడిపి మండలాధ్యక్షుడు వీరపనేని శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో గరికపర్రు గ్రామంలో గ్రామ టిడిపి ఆధ్వర్యంలో కేకు కటింగ్ జరిగింది. పామర్రు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వర్ల కుమార్ రాజా కేకును కట్‌చేశారు. ఎంపీటీసీ నర్రా వెంకట అప్పారావు, మాజీ ఎంపీటీసీ వీరంకి వరహాలు రావు, గూడపాటి గిరిబాబు, మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుడివాడ : స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం మజ్జీగ పంపిణీ చేశారు. శాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటుచేశారు. టిడిపి పట్టణ, రూరల్ మండలాల అధ్యక్షులు దింట్యాల రాంబాబు, వాసే మురళీ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గొవాడ శివ, నాయకులు సర్పంచ్ కాకర్ల సురేష్, గోకవరపు సునీల్, యార్లగడ్డ సుధారాణి, గొర్ల శ్రీలకీë, అసిలేటి నిర్మల, కంచర్ల సుధకార్, తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల : కొడాలిలోని టిడిపి కార్యాలయంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తుమ్మల జనార్థనరావు కేక్ కట్ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు మాట్లాడారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, ఘంటసాల ఉప సర్పంచ్ అయినపూడి భాను ప్రకాష్, మల్లంపల్లి సర్పంచ్ బెల్లంకొండ అమలేశ్వరరావు, మండల పార్టీ కార్యదర్శి పరిసే చలపతి, గ్రామ పార్టీ అధ్యక్షులు కంఠమనేని రాజగోపాలరావు, గుత్తికొండ వరప్రసాద్, పరుచూరి శ్రీనివాసరావు, మొవ్వ కోటేశ్వరరావు (బాచి ), వీరంకి నాగరాజు, కంఠమనేని వెంకటేశ్వరరావు, అవనిగడ్డ నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు దిరిశం వెంకట్రావు, కొమ్ము సుందరరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్న) ఆధ్వర్యంలో జరిగాయి. గ్రామ పార్టీ అధ్యక్షులు దాసం రామకృష్ణ, మేక శ్రీనివాసరావు, మత్తి శ్రీను, జీళ్ళ శ్రీను, కృపారావు, కొడాలి డేవిడ్, దుర్గ నాని, చంటి పాల్గొన్నారు. మొవ్వ : మొవ్వ మండలం కూచిపూడిలో పార్టీ సీనియర్ నాయకులు తాతినేని చిన్నపూర్ణ కేకు కట్ చేసి పంపిణీ చేశారు. మండల టిడిపి అధ్యక్షులు రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు నన్నపనేని వీరేంద్ర,పెడసనగల్లు ఎంపిటిసి సభ్యుడు మట్ట శివ నందిని ,రాజులపాటి మస్తాన్,యార్లగడ్డ శ్రీను, బత్తిన శ్రీను,తాతా నాని,రాజశేఖర్, తులసీదాస్, దేవినేని రమేష్, టిడిపి జిల్లా ఉపాద్యక్షులు పెదపూడి ఆనంద్ పాల్గొన్నారు. అవనిగడ్డ : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద మాజీ సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కేకును కట్ చేశారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి కర్ర సుధాకర్, నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు బండే కనకదుర్గ, విశ్వనాథపల్లి పాప, జిల్లా కార్యదర్శి బచ్చు రఘునాథ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, మండలి రామ్మోహనరావు, యలవర్తి చిన్న, మెగావత్ గోపి, కంచర్ల ఆనంద్, ఘంటసాల రాజ మోహనరావు, బర్మా శ్రీనివాసరావు, మండలి శేషు పాల్గొన్నారు.










