Jun 14,2023 22:55

చెగువేరా చిత్రపటం వద్ద నాయకుల నివాళి

ప్రజాశక్తి -పెనుకొండ: పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో బుధవారం చేగువేరా 95 వ జయంతి ని నిర్వహఙంచారు. ఈ సందర్భంగా అయన చిత్రపటానికి సీఐటీయూ నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చేగువేరాఅంటే ఒక విప్లవం, ఒక చైతన్యం అని అన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని అణచివేతను యువత ప్రశ్నించడమే చేగువేరా జయంతి సందర్భంగా ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సిఐటియు మండల నాయకులు తిప్పన్నా, మహబూబ్‌షా, మూర్తి, మహేష్‌, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.