ఘనంగా అల్లూరి సీతరామరాజు జయంతి
చాగలమర్రి : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలో ఇన్చార్జి హెచ్‌ఎం కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో అల్లూరి సీతరామరాజు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా అల్లూరి ధైర్యసాహసాలను, పోరాట పటిమను కొనియాడారు .కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంబటి బాస్కర్‌రెడ్డి,శ్రీనివాసులు,హరిహరనాథ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహనీయులు గురించి మాట్లాడుతున్న ఎం.వెంకటసుబ్బారెడ్డి
డోన్ : డోన్ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మహనీయులు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను, అలాగే స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయులు ఎం.వెంకటసుబ్బారెడ్డి,లక్ష్మయ్యలు మాట్లాడుతూ అపార ధైర్యశాలి అల్లూరి అని కొనియాడారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో శాస్త్రీయ ఆలోచనలతో ప్రపంచానికి వివేకానందుడి సందేశం అద్భుతం అని కొనియాడారు. సీనియర్ ఉపాధ్యాయులు శివప్రసాద్,రవిశేఖర్, వెంకటలక్ష్మీ, రాధ, శ్రీనివాసులు, అల్లిపీరా,రఘునాథ్ పాల్గొన్నారు.










