పుట్టపర్తి అర్బన్ : రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పుట్టపర్తి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంగళవారం నాడు ఆయన పుట్టపర్తిలో పర్యటించనున్నారు. సత్యసాయి ట్రస్టు ప్రశాంతి నిలయంలో నూతనంగా నిర్మించిన సాయిహీరా ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. పుట్టపర్తి నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ నేరుగా పాల్గొంటారు. ఈ మేరకు ఆయన సోమవారం రాత్రే పుట్టపర్తికి చేరుకున్నారు. గవర్నర్ పుట్టపర్తికి రావడంతో ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. కలెక్టర్ అరుణ్‌బబు, ఎస్‌పి మాధవరెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ బసచేసే శాంతి భవన్ సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించారు. గవర్నర్ పర్యటన కోసం ఏర్పాట్లను పకడ్బందీగా చేశామన్నారు. మామిళ్లకుంట క్రాస్ నుంచి శాంతిభవన్ అతిథి గహం వరకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గవర్నర్ కాన్వారుకు సంబంధించి పోలీసులు సోమవారం సాయంత్రం ముందస్తుగా రిహర్సల్స్ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నవీన్ కుమార్, సత్యసాయి సెంట్రల్ సభ్యులు పాల్గొన్నారు.










