గవర్నర్ కు ఘన స్వాగతం
ప్రజాశక్తి- రేణిగుంట: రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరు కున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ కె.వెంకటరమ ణా రెడ్డి, ఎస్‌పి పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్‌పి కులశేఖర్ , ఆర్‌డిఓ కనక నరసా రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌లు భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, రేణిగుంట తహశీల్దారు ఉదయ సంతోష్, డిఎస్‌పి భవ్య , స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను రెవెన్యూ , పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ రోడ్డు మార్గంలో తిరుమల బయలుదేరి వెళ్లారు. నేటి రాత్రి తిరుమలలో బస చేసి , ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని బెంగళూరు వెళ్లనున్నారు.










