Sep 16,2023 19:47

ప్రజాశక్తి - ఉంగుటూరు
   గురజాడ అప్పారావు గొప్ప అభ్యుదయ కవి అని, ఆయన తన రచనలు ద్వారా సాంఘిక దురాచారాలను తొలగించటానికి ప్రయత్నం చేశారని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. కైకరం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో గురజాడ అప్పారావు జయంతి వారోత్సవాలు ఇన్‌ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ కుమార్‌ శనివారం ప్రారంభించారు. వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు గురజాడ గురించి వ్యాస రచన, వక్తృత్వ, దేశమంటే మట్టికాదోరు గేయ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు ఎం.రవి, పివి.కన్నారావు, బి.రామారావు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.