-జెడ్‌పిటిసి గంగరాజు
ప్రజాశక్తి -అనంతగిరి:ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు గుణత్మకమైన విలువలతో కూడిన విద్యా బోధనల అందిస్తే ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారం ఉంటుందని స్థానిక జెడ్పిటిసి గంగరాజు ఉపాధ్యాయులకు సూచించారు. మండల పరిధి ఎగువశోభ మండల పరిషత్ పాఠశాలను శుక్రవారం సందర్శించిన గంగరాజు ఉపాధ్యాయురాలు మణిమా లను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాద్యాయులు విద్యార్థులపై దృష్టి కేంద్రీ కరించడంతో విద్యా ప్రమాణాలు మెరుగు పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది నవీన్, మాధురి, భార్గవి, వాలంటీర్లు పాల్గొన్నారు










