Oct 30,2023 21:31

మాట్లాడుతున్న ఎంఇఒ

మాట్లాడుతున్న ఎంఇఒ
గుణనాత్మక విద్యనందించాలి
ప్రజాశక్తి-కలువాయి:విద్యార్థులందరికీ గుణాత్మక విద్యనందించాలని ఎంఇఒ తెలిపారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్‌ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆయా ప్రభుత్వ ప్రయివేట్‌ పాఠశాలలో స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే పరీక్ష నిర్వహణపై మండలంలోఎంపిక కాపబడింది. 33 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పరీక్ష కేంద్రాలకు కేటాయించబడిన ఫీల్డ్‌ ఇన్వెస్ట్‌ గేటర్‌లకు (శివ సాయి డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు) శిక్షణ కార్యక్రమం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ యాజమాన్యాలలోని 33 ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో 3,6,9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నవంబర్‌ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు బాలకష్ణారెడ్డి, శేషగిరిరావు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ పరీక్షను ప్రధానోపాధ్యాయులతో కోఆర్డినేషన్‌ చేసుకుని ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌ విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు.
విద్యా వ్యవస్థ బలాలు బలహీనతలు అంచనా, లోపాలను గుర్తించడం, తరగతిగది విషయంలో జోక్యం చేసుకొని విద్యాభ్యాసనలో తోడ్పాటున అందించాలి. గుణనాత్మక విద్య నందించే ప్రక్రియలో అందరూ జోక్యం కల్పించుకోవడం, ఉపాధ్యాయుల వత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పాటు అందించాలన్నారు. అభ్యసనా లక్ష్యాలను చేరుకోవడం తదితర అంశాలను లక్ష్యాలుగా చేసుకుని, ప్రాథమిక అక్షరాస్యత అంకగణిత ప్రక్రియలలో, విద్యార్థుల సామర్థ్యాలు తెలుగు మీడియం వారికి తెలుగు గణితం ఆంగ్లం మాధ్యమం వారికి ఆంగ్లం గణితములలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి రిసోర్స్‌ పర్సన్లుగా వల్లూరు కష్ణారెడ్డి, ఓబులేసు, కోఆర్డినేటర్‌ యానాదయ్యలు వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంపిక కాబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్స్‌, తదితరులు పాల్గొన్నారు.