బుక్‌లెట్‌ను ఇస్తున్న ఎమ్మెల్యే
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని గుంటసీమలో స్థానిక అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో బుధవారం గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని ప్రతి గడపగడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలపై కరపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తూ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి ఈశ్వరి, జెడ్పిటిసి సిహెచ్ జానకమ్మ, స్థానిక సర్పంచ్ బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.










