Jul 09,2023 21:21

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-మడకశిర :నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్సీ, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామిని విమర్శించే స్థాయి మడకశిర వైసిపి నాయకులకు లేదని టిడిపి నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. పట్టణం లోని బాలాజీనగర్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ ద్వారా మొట్టమొదటి సారిగా మడకశిరకు నీళ్లు తెచ్చిన ఘనత గుండుమల తిప్పేస్వామిది అన్నారు. పట్టణంలో రోడ్లు, హైవే, రింగ్‌ రోడ్దు, వంద పడకల ఆసుపత్రి, టూరిజం గెస్ట్‌ హౌస్‌, ఇండోర్‌ స్టేడియం, తహశీల్దార్‌ కార్యాలయం తో పాటు రూ. 40 కోట్ల నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేశారన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు గుండుమల అన్నారు. దళిత నాయకులను రెచ్చగొడుతూ రాక్షసానందం పొందుతున్న వ్యక్తి తిప్పేస్వామి అని విమర్శించారు. వైసిపి హయాంలో మడకశిర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండని సవాల్‌ విసిరారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్‌ మనోహర్‌, కార్యదర్శి పుల్లయ్య చౌదరి, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు భక్తర్‌సాబ్‌, తలమర్ల సుబ్బరాయుడు, గోపాలప్ప, డాక్టర్‌ సెల్‌ కృష్ణమూర్తి, నాయీబ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మార్కెట్‌ బాబు, గంగాధరప్ప, రమేష్‌, రవి, ఎస్‌.నగేష్‌, యూనిట్‌ ఇన్‌ఛార్జి నాగేంద్ర, మంజు, కమలాకర్‌, ఉన్నారు.