Oct 13,2023 21:19

పాఠశాల ఆవరణలో ఉన్న గులాబీ తోట

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  మండలంలోని పి.ఆమిటి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారంటే అక్కడ గులాబీ వనం సువాసనతో స్వాగతం పలుకుతుంది. ఈ పాఠశాల పరిసర ప్రాంతమంతటా గులాబీ మొక్కలే దర్శనమిస్తాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న వార్డెన్‌ కేండ్రుక గౌరీశ్వరి పాఠశాల లోపల, పరిసర ప్రాంతమంతా వివిధ రకాలైన మొక్కలను పెంచుతూ, కూరగాయలు సాగు చేస్తూ పచ్చదనంతో పెంపొందిస్తున్నారు. గులాబీ మొక్కలు, వివిధ రకాలైన కూరగాయల సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ పండిస్తున్న పంటలు విద్యార్థుల భోజనానికి వినియోగిస్తున్నట్లు వార్డెన్‌ గౌరీశ్వరి తెలిపారు. పాఠశాల ఆవరణ అంతా కూరగాయల తోటలతో, పూల మొక్కలతో కళకళలాడుతుంది.