గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
ఎంపిడిఒ టి.సీతామహాలక్ష్మి
ప్రజాశక్తి-పెదపారుపూడి
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీడీవో టి. సీతామహాలక్ష్మి కోరారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలపై స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, లే అవుట్ల ప్రత్యేక అధికారులు, హౌసింగ్ ఏఈ, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి లే అవుట్‌ను సంబంధిత శాఖ అధికారులు సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి అధిక సంఖ్యలో ఇంటి నిర్మాణాలు ప్రారంభించి, పూర్తి చేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మల్లికార్జునరావు, మండల ఈవోపీఆర్డి ఎం.నాగిరెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










