Sep 08,2023 21:28

గరికిపాటికి నివాళ్లు అర్పిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పాచిపెంట: డాక్టర్‌ గరికపాటి రాజారావు 60 వర్ధంతి స్థానిక కమ్యూనిటీ భవనం వద్ద జానపద కళాకారుడు బొబ్బిలి అప్పారావు, ప్రజాసంఘాల నాయకులు ఏడుకొండలు జరజాపు నూకరాజు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా డాక్టర్‌ గరికపాటి రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్‌ కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ రాజారావు వృత్తిపరంగా డాక్టర్‌గా వైద్యం చేస్తూ ప్రజా కళాకారుడిగా నిరంతరం ప్రజలకు చైతన్యం చేస్తూ నాటికలు వీధి నాటికలు ప్రదర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించారని అన్నారు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు, జంతుబలులకు వ్యతిరేకంగా అశాస్త్రీమైన పద్ధతులను నిరసిస్తూ వీధి నాటకాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప కళాకారుడని కొనియాడారు. కళ కోసం కాదని, కళ ప్రగతి కోసం ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసమని వీధి నాటికల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఎంతో మంది ప్రజా కళాకారులను తీర్చిదిద్దిన గరికపాటి ధన్యుడని కొనియాడారు. ఈ సందర్భంగా గరికపాటి రాజారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని గరికపాటి బాటలో ప్రజా కళాకారులు చైతన్యవంతంగా ముందుకు నడవాలని అదే ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు.