Oct 21,2023 00:55
ఉప్పలపాడు గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

ప్రజాశక్తి-పొదిలి: బాపూజీ కలలు గన్న గ్రామస్వరాజ్యమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హమీ ఇచ్చిన అన్ని పధకాలను అమలులోకి తీసుకువచ్చేందుకు దేశంలో ఎక్కడ లేని విధం గా గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు. గ్రామీణ వైద్యంపై అవగాహన కోసం జగనన్న సురక్ష పథకం ప్రవేశ పెట్టి ప్రతిఒక్కరి ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. మన నియోజకవర్గంలో అన్నిరకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ప్రతి కుటుంబ సంక్షేమానికి లక్షల రూపా యలు అర్థిక సహాయం అందిస్తూ నేరుగా వారికే డబ్బులు జమ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి రైతుకు అన్ని విధాల ఆదుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడాఅందుబాటులోకి తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఆశయాలను నేరవేరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జి ఏసేబు, మాజీ సర్పంచ్‌ ఉలవా గోపి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరక్టర్‌ కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, వైసిపి సేవాదళ్‌ అధ్యక్షులు గుజ్జుల సంజీవ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి, నగర పంచాయతీ అధ్యక్షురాలు ఎస్‌కె నూర్జాహాన్‌ బేగం, గొలమారి చెన్నారెడ్డి, జి శ్రీను, గూడూరి వినోద్‌ కుమార్‌, పి కృష్ణ, ఇఓఆర్‌డి పిటివి కృష్ణ, వ్యవసాయాధికారి ఎస్‌కె జైనులాబ్దిన్‌, వైసిపి నాయకులు కె వెంకటేశ్వర్లు, ఉలవ పెద్దబ్రహ్మయ్య, కె చిన్న వెంకటేశ్వర్లు, గోగినేని ముసలయ్య, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.