Jul 14,2023 19:14

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.అజరు బాబు, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి కల్లుబావి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్‌ నీరు తాగి రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ప్రజావసరాలను తీర్చలేని ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పట్టణ కార్యదర్శి సుదర్శన్‌, ప్రజాసంఘాల నాయకులు మంజునాథ్‌, గోపాల్‌, కరెంట్‌ ఈరన్న, రతన్‌ సింగ్‌, తమ్మి రెడ్డి, గోపాల్‌ సింగ్‌ పాల్గొన్నారు.