Jul 27,2023 20:17

కుందనగుర్తిలో పులి వేషధారణలో ఉన్న యువత

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరితో పాటు నేమకల్లు, రామదుర్గం, కుందనగుర్తి తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలను వైభవంగా నిర్వహించారు. పండగ సందర్భంగా యువకులు మహిళలుగా, పులి వేషధారణలో సంబరాలు జరుపుకున్నారు. గురువారం నేమకల్లు, కుందనగుర్తి గ్రామంలో గ్రామస్తులు పులి వేషాలు వేసి వీధుల్లో తిరుగుతున్న నేపథ్యంలో మహిళలు, ప్రజలు మెచ్చుకునే విధంగా ఆకట్టుకున్నారు. ముందుగా గ్రామం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి డప్పులు, వాయిధ్యాలతో, పులి వేషాలు వేస్తూ పీర్లా చావిడికి చేరుకున్నారు. మతాలకతీతంగా పండగ జరుపుకోవడం శుభ పరిణామమని ప్రజలు పేర్కొంటున్నారు. మొహర్రం సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చిప్పగిరి ఎస్‌ఐ రమేష్‌ బాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆలూరు పట్టణ, గ్రామాల్లో మొహర్రం వేడుకలను కులమతాలకు అతీతంగా ప్రజలు జరుపుకున్నారు. మండలంలోని మనేకుర్తి, అంగస్కల్‌, మొలగవల్లి, అరికెర, ఆలూరులో పులి, విచిత్ర వేషధారణతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. డప్పులతో పీర్లచావిడి వద్దకు వెళ్లారు.

మనేకుర్తిలో విచిత్ర వేషధారణ
మనేకుర్తిలో విచిత్ర వేషధారణ