Mar 16,2023 22:49

matladutuna parasa jagan

గ్రామాల్లో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : కంబపు
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం సాధనలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని రెడ్డిక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంబపు రాంబాబు అన్నారు. పమిడిముక్కల మండలంలోని మంటాడ గ్రామంలో వాలంటీర్లు, గృహసారథులతో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో పమిడిముక్కల మండల సచివాలయాల కన్వీనర్‌ పర్సా జగన్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. నిరంతరం పేదలు, అన్ని తరగతుల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సిఎం వైఎస్‌ జగన్‌ కృషిచేస్తున్నారన్నారు. పమిడిముక్కల మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు కొడమంచిలి మహేష్‌, గంజాల సీతారామయ్య, మంటాడ ఎంపీటీసీ సభ్యురాలు మేరుగు శ్రీలక్ష్మి, కోడెబోయిన కోటేశ్వరరావు, దారపు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.