Sep 08,2023 19:45

సమావేశంలో మాట్లాడుతున్న హంపి రెడ్డి

ప్రజాశక్తి - దేవనకొండ
వాతావరణ బీమా పరిహారాన్ని మండల యూనిట్‌గా కాకుండా గ్రామ యూనిట్‌గా గుర్తించి ఇవ్వాలని మండల వ్యవసాయ సలహా సంఘం అధ్యక్షులు హంపి రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ సలహా సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎఒ సురేష్‌ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌లో మండలంలో 75 వేల ఎకరాల్లో పత్తి, వేరుశనగ, చొలకాయ, ఆముదం, టమోటా తదితర పంటల సాగు చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 వేల ఎకరాల్లో పంట నమోదు జరిగిందని వివరించారు. ప్రతి రైతూ పంట నమోదు చేయించుకోవాలని, తప్పనిసరిగా ఈకేవైసీ చేయించాలని సభ్యులకు తెలిపారు. పంట నమోదు ఈనెల 15న ముగుస్తుందని, రైతులందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. సంఘం సభ్యులు మల్లికార్జున, కందనాతి రంగన్న, ఎఇఒలు జయరాం, యోగేంద్ర, రంగన్న పాల్గొన్నారు.