Nov 11,2023 17:47

ప్రజాశక్తి - భీమడోలు
   గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల అధ్యక్షులు తేరా రాజు(49) అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం మృతి చెందారు. కారుణ్య నియామకం కింద సుమారు 12 సంవత్సరాల క్రితం గ్రామ రెవెన్యూ సహాయకులుగా బాధ్యతలను స్వీకరించిన ఆయన చెట్టున్న పాడు కేంద్రంగా పనిచేశారు. సంఘం ద్వారా పలు సమస్యల పరిష్కారానికి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించేవారు. ఆయనకు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భీమడోలు డిప్యూటీ తహశీల్దార్‌ షంషుద్దీన్‌ ఆధ్వర్యంలోని రెవెన్యూ కార్యాలయ అధికారులు, సిబ్బంది, విఆర్‌ఒల సంఘ నాయకులు, సభ్యులు, విఆర్‌ఎ సంఘ సభ్యులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వపరంగా మంజూరైన మొత్తాలను అందజేశారు. శాఖా పరంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ రెవెన్యూ సహాయకులుగా తేరా రాజు అందించిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.