Oct 10,2023 21:22

గ్రామస్తులకు పట్టుబడిన క్షుద్రపూజ నిర్వాహకులు

ప్రజాశక్తి - కురుపాం :  మండలంలో గొటివాడ గిరిజన గ్రామంలో సోమవారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు ఘటన కలకలం రేపింది. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు అందించిన సమాచారం ప్రకారం గోటివాడ గ్రామ పరిధిలో గల శ్మశాన వాటికి వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలో నాలుగు ద్విచక్ర వాహనాలతో 9మంది వ్యక్తులు వచ్చి కత్తులు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అందులో ముగ్గురు పరారీలో ఉన్నారని, వీరు 4 ద్విచక్ర వాహనాలతో వచ్చారని, వీరు ఏ గ్రామస్తులని అడిగితే పెంగావా, రాయఘడాజమ్ము అంటూ సరైన సమాధానం చెప్పడం లేదని స్థానికులు తెలిపారు. శ్మశాన వాటికలో పూజలు చేస్తే మొక్క ఏదో పుట్టుకు వస్తుందని, ఆ మొక్కతో జబ్బులు ఏమైనా ఉంటే నయమవుతాయని అంటున్నారని తెలిపారు. వీరిపై అనుమానంగా ఉందని, తమ గ్రామానికి వచ్చి శ్మశాన వాటిక దగ్గర ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో వారిపై అనుమానంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.