Oct 18,2023 23:03

గోపుర స్లాబు పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


ప్రజాశక్తి-మార్కాపురం
మార్కాపురం పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థాన ప్రాంగణంలో నాలుగు దిక్కులా ఎత్తైన గోపర నిర్మాణాలు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ, దాతల సహకారంతో రూ.5 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు. గోపురాల నిర్మాణం మొదటి అంతస్తుకు చేరుకోవడంతో పై కప్పు నిర్మాణ పనులను మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి బుధవారం ప్రారంభించారు. మరింత త్వరగా ఆలయ గోపురాల నిర్మాణాలు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పెనుగొండ కేశవరావు, కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీక్రిష్ణ, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మెంబర్‌ డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, కౌన్సిలర్లు కొత్త క్రిష్ణ, బుశ్శెట్టి నాగేశ్వరరావు, వైసిపి పట్టణ ప్రధాన కార్యదర్శి బొగ్గరపు శేషగిరిరావు, వైసిపి నాయకులు బత్తుల పుల్లారెడ్డి, ఆలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.