గోపిశెట్టి వీరాస్వామికి వంశీ పరామర్శ
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ శనివారం గన్నవరం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. కాపు సమ్మేళనం గన్నవరం నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోపిశెట్టి వీరాస్వామి, ఆయన కుటుంబ సభ్యులను వంశీ పరామర్శించారు. ఇటీవల వీరాస్వామి పితృవియోగానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ, గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు ఎఇ రాణి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి. గౌసాని, కాపు ఐక్య సమ్మేళ నాయకులు ఓలుపల్లి మోహన్ రంగా, యర్రంశెట్టి రామాంజనేయులు, గోపవరపు గూడెం సర్పంచ్ నల్లూరి వెంకటేశ్వరరావు, వైసీపీ మండల అధ్యక్షులు పడమట సురేష్, కన్వీనర్ నీలం బాలు, మండల పరిషత్ మాజీ వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్యలు గోపిశెట్టి ఇంటికి వెళ్లి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత ఎమ్మెల్యే వంశీ నెక్కలపూడి ఈశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు గృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గొల్లనపల్లి గ్రామంలో పర్యటించారు. సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అవరోధంగా ఉన్న ఆక్రమణదారులతో మాట్లాడారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు సహకరించాలని కోరారు. వీరస్వామిని బుద్ధవరం సిపిఎం నాయకులు బడుగు మరియదాసు కలిసి పరామర్శించారు










