Oct 02,2023 15:25

ప్రజాశక్తి-పార్వతీపురం : బార్ అసోసియేషన్ లో ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదర రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ అహింస సిద్ధాంతాన్ని అనుసరించి ప్రముఖ పాత్ర పోషించారని, గాంధీతోపాటు అనేకమంది న్యాయవాదులు స్వాతంత్ర సాధనకై ఈ ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రతి వ్యక్తి అహింస అన్నటువంటి విధానాన్ని అలవర్చుకోవాలని అన్నారు. శాంతియుతంగా సమాజం ఉండేలాగా  ప్రతి వ్యక్తి నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్  ఏ. రమేష్ అలాగే బార్ వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి కూర్మినాయుడు, సెక్రటరీ పివి కృష్ణారావు, సీనియర్ అడ్వకేట్ టీ జోగారావు, ఏజీపీ బొంగు సత్యనారాయణ, ఏపీపీ  గొర్లి వెంకట్రావు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.