గన్నవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వెంకయ్య
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తిరివిధి వెంకయ్య ఎన్నికయ్యారు. శుక్రవారం అసోసియేషన్‌కు ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి వెంకయ్య, గారపాటి రవి పోటీపడగా రెండు ఓట్ల మెజార్టీతో వెంకయ్య గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా దాసరి భాగ్య లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా జాస్తి తాతారావు, జాయింట్ సెక్రటరీగా ఎల్. భగీరధి, కోశాధికారిగా టి.వెంకట్రావు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు అనుమోలు వెంకటేశ్వరరావు, శీలం వెంకట సాంబశివరావు, ఈడే వాసుదేవరావు అభినందనలు తెలిపారు. అదేవిధంగా గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మడుపల్లి బాలకృష్ణమూర్తి, కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి సాంబశివరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకయ్యకు అభినందనలు తెలిపారు.










