ఎస్పీకి పుష్పగుచ్చం అందజేస్తున్న సీనీ నటుడు నరేష్
పుట్టపర్తి రూరల్: సినీ నటుడు నరేష్ తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం జిల్లా ఎస్పీ మాధవ రెడ్డిని గురువారం పుట్టపర్తి లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలసి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ఎస్పీ మాధవరెడ్డితో పలు విషయాలను చర్చించారు. నక్సల్స్ ప్రభావం ఉన్న తరుణంలో అనంతపురం జిల్లాలో గన్ లైసెన్స్ తనకు మంజూరు అయిందని దానిని ఇప్పుడు రెన్యూవల్ చేయాలని కోరారు. ఈమధ్య తనకు కొందరు వ్యక్తుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అంతేకాక తనకు ప్రాణహాని ఉందని చెప్పారు.










