ప్రజాశక్తి కొత్తచెరువు : 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక శ్రీవిద్య కళాశాలలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో లోని పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. అలాగే ఓటర్ జాబితా సవరణ అయినందున ఆ జాబితాన్ని పరిశీలించి ఓట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, మాజీ సర్పంచి వెంకటరమణప్ప, టిడిపి నాయకులు సుధాకర్, సురేష్, బోయ రాజు, చికెన్ సెంటర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు










