Jul 31,2023 20:28

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని రామదుర్గం గ్రామంలో మంగళవారం జరిగే 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని వైసిపి నాయకులు కోరారు. సోమవారం మండల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, ఎంపిపి భర్త, వైసిపి యువ నాయకులు జూటూరు మారయ్య, వైసిపి కన్వీనర్‌ ఏరూరు రంగస్వామి, యువజన నాయకులు వీరవిక్రాంత్‌రెడ్డి మాట్లాడారు. మంగళవారం రామదుర్గం గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు సర్పంచి రోహిణి ఆధ్వర్యంలో 'రచ్చకట్ట' 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ హాజరవుతారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. సర్పంచి గోవిందరాజులు, వైసిపి నాయకులు బెల్డోన గోవిందు, రాజన్న, షేకన్న, లింగన్న, వలీ పాల్గొన్నారు.