ప్రజాశక్తి-చల్లపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సచివాలయం-1 పరిధిలోని చింతలమడ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సోమవారం జరిగింది. శాసనసభ్యులు రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లూరు కోటేశ్వరరావు, సచివాల కన్వీనర్ ఎడ్ల జగదీష్ ఎంపీటీసీ సభ్యులు మోపిదేవి ద్వారకానాథ్, పిఎసిఎస్ చైర్.పర్సన్ నాని, కార్యదర్శి రమేష్ బాబు, హౌసింగ్ ఏఈఎం అరుణ కుమారి, వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా నాయకురాలు బొందలపాటి లక్ష్మి పంచాయతీ కార్యదర్శి ఆకుల సాంబశివరావు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










