Oct 06,2023 15:23

ప్రజాశక్తి-ఆదోని : బాబు కోసం మేము సైతం అంటూ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో శుక్ర‌వారం ఎన్‌టిఆర్ స‌ర్కిల్ వ‌ద్ద‌ రోడ్డుపై వినూత్నంగా బోటులో వ‌ల‌లతో చేప‌లు ప‌డుతూ జాలర్లు నిర‌స‌న తెలిపారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, నాయకులు రామస్వామి, లక్ష్మీనారాయణ, శివప్ప, మాజీ కౌన్సిలర్లు బాలాజీ, నరసింహులు, బ్రహ్మ, వీరేష్, మల్లికార్జున, రంగన్న, జగదీష్, కృష్ణారెడ్డి, లింగన్న గౌడ్ పాల్గొన్నారు. కొనసాగిన దీక్షలు బాబు అరెస్టును ఖండిస్తూ రిలే నిరాహార దీక్ష‌లు కొనసాగుతున్నాయి.ఆదోనిలోని ఎన్‌టిఆర్ విగ్ర‌హం వ‌ద్ద రిలే నిరాహార దీక్ష‌లు 24 రోజుకు చేరుకున్నాయి. దీక్ష‌ల్లో బెస్త గంగాపుత్ర సోద‌రులు మహానంది, రఘు, బెస్త, జయ, సూర్య, హనవలు తిమ్మప్ప, బసవరాజు, బెస్త నాగేంద్ర, ఉమేష్, పేసలబండ రవి, కల్లుబావి మల్లికార్జున, వీరేశ్, హనవాలు, వీరెష్, నరేష్, లక్ష్మన్న, రామాంజినేయులు కూర్చున్నారు. మీనాక్షి నాయ‌కుడు మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టి మళ్లీ ఎన్నికలలో గెలవాలని చూస్తున్నారన్నారు. తనను తాను జగన్ అద:పాతాళానికి తొక్కేసుకుంటున్నారన్నారు. లేని రింగు రోడ్డులో అక్రమాలు జరిగాయని మరో కేసు పెట్టారని విమ‌ర్శించారు. టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, గంగపుత్రు బెస్త నాయకులు శేశన్న, బెస్త రామాంజినేయులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.