Oct 07,2023 08:57

ప్రజాశక్తి-ఉంగుటూరు : రూప్ చంద్ చేపలు కిలో రూ.80 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ఆక్వారైతులు, ట్రేడర్స్ సమావేశం నిర్ణయించింది. రూప్చంద్ ధర పడిపోవడంతో ఉంగుటూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలకు చెందిన పలువురు ఆక్వారైతులు, ట్రేడర్స్ మధ్యవర్తులతో కలిసి నారాయణపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు మాట్లాడుతూ కిలో రూపచంద్ ఉత్పత్తి చేయడానికి రూ.95 ఖర్చు అవుతోందని, మార్కెట్లో కిలో రూ.60కి పడిపోయిందని వాపోయారు. ఈ నెల 15న నియోజకవర్గంలోని మొత్తం ఆక్వా రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కిలో రూ.80 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఆక్వా రైతులకు న్యాయం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.