ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఎన్.ఎస్.ఎల్ టెక్స్ టైల్స్ వస్త్రాల తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంబంధించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని వస్త్రాలతో పాటు మిషనరీ మంటల్లో కాలిపోయాయి. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిలినట్లుగా ఫ్యాక్టరీ యజమాని తెలిపారు. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.










