ప్రజాశక్తి-గంగాధర నెల్లూరు : చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో తూగుండ్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని తూగుండ్రం గ్రామ పంచాయితీ కొత్త సచివాలయం పక్కన ఉన్న పాలసముద్రం మండలం ఆముదాల పుత్తూరు గ్రామానికి చెందిన అరుణాచలం ఆచ్చారి వాళ్ల సోదరుల సామిల్ (కట్టెల దొడ్డి) బుధవారం ఉదయం 4 గంటలకు అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక ఇంజన్లు వచ్చినా ఫలితం లేకపోయింది. సుమారు 25 లక్షలకు పైగా నష్టం వాటిలిందని బాధితుడు వాపోతున్నారు.










