Sep 16,2023 17:51

ప్రజాశక్తి-సి బెళగల్(కర్నూల్) : కర్నూల్ జిల్లా సి బెళగల్ మండలంలోని పోలకల్ లో దీన్నే మద్దిలేటి (53) అప్పుల బాధతో తాళలేక శనివారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై పీరయ్య తెలిపిన వివరాల మేరకు మద్దిలేటికీ మూడేకరాలు కాగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకోని పంటలు సాగుచేసేవాడు. కాలం కలిసి రాక పెట్టిన పెట్టుబడులు అధికమై చేసిన అప్పులు భారమై కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడికి భార్య నాగలక్ష్మి మూర్ఛ వ్యాదితో బాధపడుతోంది. ఒక కుమారుడు కలరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.