Sep 17,2023 17:01

ప్రజాశక్తి ఆదోని : ఆదోనిలోని విజ‌న్ ఐకేర్‌లో సున్ని దావతే ఇస్లామి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన ల‌భించింద‌ని ఎస్‌డీఐ సభ్యులు హాఫీజ్, గూడూర్ మంజూర్ అహ్మద్, అబ్దుల్ లతీఫ్, ముక్తార్ అహ్మద్, సికందర్ తెలిపారు. సుమారు 100 మందికి పైగా డాక్టర్ జునైద్ ఉచిత కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి కంటి అద్దాలు అందించామ‌న్నారు. దైవ ప్రవక్త మహమ్మద్ పుట్టిన పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది సున్ని దావతే ఇస్లామి సంస్థ ప‌లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంద‌న్నారు. కులమతాలకు అతీతంగా అందరు ఈ శిబిరంలో పాల్గొన్నారని సభ్యులు తెలిపారు. ఉచిత క్యాంప్ నిర్వహించిన సున్ని దావతే ఇస్లామి సంస్థ ప్ర‌తినిధుల‌కు వారు అభినందన‌లు తెలిపారు.