ఎస్వీసీఈలో ఘనంగా ఐక్యత దినోత్సవం
ఎస్వీసీఈలో ఘనంగా
ఐక్యత దినోత్సవం
తిరుపతి(మంగళం): తిరుపతి-కరకంబాడి మార్గంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని వల్లభారు పటేల్ జీవిత చరిత్ర పై విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశం విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నడిపించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభారు పటేల్ అని, వల్లభారు పటేల్ ను ఆదర్శంగా తీసుకొని దేశ అభివద్ధికి ఏకతాటిపైకి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులచే ఐక్యత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు చంద్రయ్య, సుజన్ కుమార్ పాల్గొన్నారు.










