ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోనే జగనన్న విద్యాదీవెన నిధులు జమ
కృష్ణాజిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి సరస్వతి
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
2022-2023 విద్యాసంవత్సరం నుండి ఎస్ సి విద్యార్థులకు మంజూరయ్యే జగనన్న విద్యా దీవెన నిధులను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుందని జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి కె. సరస్వతి తెలిపారు. జిల్లాలోని కళాశాలల్లో చదువుకునే ఎస్‌సి విద్యార్థినీ విద్యార్థులంతా తమ బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్‌కు 'ఎన్‌పిసిఐ పోర్టల్‌లో అతి త్వరగా అనుసంధానం చేసుకోవాలన్నారు. వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఎన్‌పిసిఐ పోర్టల్లో పేర్లు అనుసంధానం చేసుకున్నవారికి మాత్రం జగనన్న విద్యాదీవెన నిధుల మంజూరు జరుగుతుందని వివరించారు. జిల్లాలోని ప్రిన్సిపాల్స్ అందరూ తమ కళాశాలలో చదువుతున్న ఎస్‌సి విద్యార్థులందరికీ సమాచారం అందించాలని కోరారు. బుధవారంనాటికి అనుసంధానం అయ్యే విధంగా చూడాలని కోరారు.










