పుట్టపర్తి అర్బన్: సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్ర బాడ్జీలు ధరించి డిపో గేటు ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జోనల్ ఉపాధ్యక్షుడు ఎస్ శంకర్, యూనియన్ జిల్లా చైర్మన్ ముత్యాలప్ప మాట్లాడుతూ జిల్లాలో ఉద్యోగుల అక్రమ బదిలీలు, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఉపాధ్యక్షులు రవితేజ, కోశాధికారి చండ్రాయుడు, కార్యదర్శి శ్రీనివాసులు, డిపో సలహాదారుడు అప్పిరెడ్డి, డిపో కార్యదర్శి బాబు జాన్, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు నూర్ మహమ్మద్, నాయకులు శివశంకర్, కళావతి, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ :పట్టణంలోని ఆర్టీసీ డిపోలో బుధవారం నేషనల్ మద్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు గేటిమీటింగ్ నిర్వహించి ఎర్రబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంయుఎ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణ, జోనల్ వైస్ ప్రెసిడెంట్ జేపీ కుమార్, రీజనల్ అధ్యక్షులు అశ్వర్థమయ్య, రీజనల్ నాయకులు నాగశేఖర్, నీళ్ల శంకరయ్య, దుర్గప్రసాద్ మాట్లాడుతూ అక్రమ బదిలీలు, అక్రమ సస్పెన్షన్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్యారేజీలో నామ్స్ ప్రకారం అన్ని క్యాటగిరిలలో సిబ్బందిని నియమించాలని, గ్యారేజీలో అవసరమైన పనిముట్లు తెప్పించాలని, నైట్‌అవుట్, నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ లో ప్రతినెల జీతంతో కలిసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నిరసనలో యూనియన్ నాయకులు హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
కదిరి అర్బన్ : జిల్లాలోని ఆరు డిపో లలో నెలకొని వున్న ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని రీజినల్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం కదిరి డిపో నందు ఉద్యోగులు ఎర్రబ్యాడ్జిలు ధరించి, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా కడప జోన్ జాయింట్ సెక్రటరీ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ జిల్లా ప్రజారవాణా అధికారి, ఉద్యోగుల సమస్యల పట్ల మొండివైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగులకు అక్రమ బదిలీలు చేస్తున్నాడని, అప్పీల్లు పెండింగ్ లో వున్నాయని, ఉద్యోగుల బకాయిలు ఇవ్వడం లో అశ్రద్ద వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ నాయకులు ప్రభాకర్ రెడ్ది,గంగన్న, డిపో అధ్యక్షులు రామక్రిష్ణ, చైర్మన్ నారాయణ స్వామి, సెక్రటరీ బైరిశెట్టి, రమణ, అజీజ్, ఫయాజ్, రహంతుల్లా, రామయ్య తదితరులు పాల్గొన్నారు.










