Oct 21,2023 22:57

ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ భేష్‌

ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ భేష్‌

కలెక్టర్‌కు ఈసిఐ ప్రతినిధి,
ఈవిఎం ఎఫ్‌ఎల్‌సి పరిశీలన
నోడల్‌ అధికారి ప్రశంస

ప్రజాశక్తి -రేణిగుంట: భారత ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటింగ్‌ యంత్రాల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ నిబంధల మేరకు సక్రమంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ కె వెంకటరమణారెడ్డిని ఈసిఐ ప్రతినిధి, ఈవిఎం ఎఫ్‌ఎల్‌సి పరిశీలన నోడల్‌ అధికారి వి రాఘవేంద్ర ప్రశంసించారు. ఓటింగ్‌ యంత్రాల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ పరిశీలన నిమిత్తం జిల్లాకు నియమితులై జాయింట్‌ ఛీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, కర్ణాటక ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ పరిశీలన నోడల్‌ అధికారి వి రాఘవేంద్ర తిరుపతి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి కె వెంకట రమణ రెడ్డి తో కలిసి రేణిగుంట వద్ద సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గొడౌన్‌ లో భద్రపరిచిన ఈవిఎంలను, అక్కడ జరుగుతున్న ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. శనివారం ఈవిఎంల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ పరిశీలన కోసం జిల్లాకు కేటాయించబడిన జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌, కర్ణాటక ఈవిఎం ఎఫ్‌ఎల్సి పరిశీలనా నోడల్‌ అధికారి రాఘవేంద్ర కలెక్టర్‌ తో కలిసి రేణిగుంట వద్ద సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గొడౌన్‌ లో భద్రపరిచిన ఈవిఎంల ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియ ను పరిశీలించారు. ఈవిఎంఎఫ్‌ఎల్‌సి పరిశీలనా నోడల్‌ అధికారికి కలెక్టర్‌ ఎఫ్‌ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లను వివరించారు. నోడల్‌ అధికారి బెల్‌ ఇంజినీర్లతో ఈవిఎంల పనితీరును, తనిఖీ చేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడి వారి సందేహాలను నివత్తి చేసి పలు సూచనలు చేశారు. ఈవిఎం గొడౌన్‌ ను పరిశీలించారు. నిర్వహిస్తున్న విజిటర్స్‌ రిజిష్టర్‌, భద్రత ఏర్పాట్లను తదితరాలను పరిశీలించారు. ఎఫ్‌ఎల్సీ తనిఖీ అనంతరం మాట్లాడుతూ తాను భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈవిఎం ఎఫ్‌ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లను చూశానని , తిరుపతి జిల్లాలో ఎఫ్‌ఎల్సీ ప్రక్రియ ఏర్పాట్లు బాగున్నాయని, చక్కగా నిబంధనల మేరకు ఉన్నాయని కలెక్టర్‌ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈవీఎం ల నోడల్‌ అధికారి కోదండరామి రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐఎన్‌సి చిరంజీవి, సిపిఐ (ఎం) సెల్వరాజ్‌, ఆమ్‌ ఆద్మీ నాయకులు డాక్టరు వెంకటరమణ, రేణిగుంట తహశీల్దారు ఉదయ సంతోష్‌, ఎన్నికల నిర్వహణ తహశీల్దార్‌ సురేష్‌, డిఎస్పీ, భద్రతా సిబ్బంది, విధులు ఇర్వహిస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.