ప్రజాశక్తి-కలెక్టరేట్ (కష్ణా)
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా వి.నారాయణరెడ్డి, కె.ఎన్.వి. ప్రసాదరావులు ఎన్నికయ్యారు. శనివారం ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడలో ఓ ప్రైవేట్ పంక్షన్ హాలులో నిర్వహించిన పంచాయతీరాజ్ అధికారుల సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా జి.వి. సూర్యనారాయణ, రాష్ట్ర కన్వీనర్‌గా నాతి బుజ్జి, కోశాధికారులుగా పి. నరేష్ కుమార్, ఏ. సుధాకర్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం సభ్యులు రాష్ట్రంలోని జడ్పీ, సిఈఓలు, డిప్యూటీ సీఈఓ లు, డివిజనల్ అభివద్ధి అధికారులు, ఎంపీడీవోల సంక్షేమం హొకోసం పని చేయనున్నట్లు స్పష్టం చేశారు. నూతన కార్యవర్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు హొకాకర్ల వెంకట్రామి రెడ్డి అభినందించారు. 250 మంది ఎంపీడీవో లకు డివిజనల్ ,జిల్లా అధికారులుగా, 200 మందికి పంచాయితీ రాజ్ ఉద్యోగులకు ఎంపీడీవో లుగా పదోన్నతి ఇవ్వడం పట్ల రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వానికి కతజ్నతలు తెలిపారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివద్ధి అధికారి కార్యాలయాలకు శాశ్వత భవనాలు మంజూరు చేయాలని, ఎంపిడివో పోస్టు పేరును బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బి.డి.వో)గా మార్పు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి హొచేసింది.










