ప్రజాశక్తి - ఆదోని
ఎన్నో ఏళ్ల బీసీల కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆదోనిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబర్ 15 నుంచి బీసీల కుల జనగణన చేపడతామని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పదవులు బీసీలకు ఎంతో గౌరవమన్నారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీలూ బీసీల జనాభా ప్రాతిపదికన రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు కేటాయించాలని కోరారు. ఆదోని పట్టణ అధ్యక్షులు డాక్టర్ వీరేష్, మంత్రాలయం తాలూకా అధ్యక్షులు పెద్దకడబూరు రఘురాం, తాలూకా గౌరవ సలహాలు బి.రాముడు, పట్టణ గౌరవ సలహాదారులు కపటి వీరభద్ర, డాక్టర్ సోమశేఖర్, నీలకంఠ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న దస్తగిరి నాయుడు










