May 25,2023 22:41

రికార్డులు పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం రూరల్‌ మండలం, పురపాలక సంఘ వ్యాప్తంగా వచ్చిన ఎన్నికల దరఖాస్తులను త్వరతగితిన పరిష్కరించాలని సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌ అధికారులకు అదేశించారు. ఈ మేరకు ఆయన గురువారం హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా తహశీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపిడిఒకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల విభాగానికి ఫారం 6, 7, 8 కింద ధరఖాస్తు చేసుకున్న వాటిని వెంటనే పరిశీలన చేసి వాటిని పరిష్కరించాలన్నారు. అదే విధంగా మండల వ్యాప్తంగా సచివాలయాల భవన నిర్మాణాల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మలగూరు వద్ద అసెన్డు భూములను పరిశీలించారు. అసెన్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ భూములను అమ్మిన కొనుగోలు చేసిన నేరమే అన్నారు. ఇప్పటికే మలగూరు ప్రాంతంలో అమ్మకాలు జరిగినట్లు తేలిందని వాటిని పరిశీలన చేశామని చెప్పారు. నిబందనల మేరకు వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రసాద్‌, ఇఒఆర్‌డి నటరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.