సీతంపేట: నూతన విద్యావిధానంలో విద్యా బోధన సమర్ధవంతంగా నిర్వహించాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. నూతన విద్యా విధానంలో బోధన జరపడం కోసం ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, గురుకులం ప్రిన్సిపాళ్లకు స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో కోర్స్ డైరెక్టర్, ఉప విద్యాశాఖ అధికారి ఎ.లిల్లీ రాణి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేయాలరన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం నిరంతరం జరుగుతుందన్నారు. డిడి మంగవేణి జ్యోతిప్రజ్వలన చేసి వృత్యాంతర శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒమరవిల్లి డైట్ ప్రిన్సిపల్ తిరుమల చైతన్య మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ, పేరెంట్స్ పాత్ర, శాలసిద్ధి గురించి తెలిపారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిరక్షణ, వ్యాధుల నివారణ, భోజనాల్లో పోషకాలు గురించి వ్యాధి నిరోధక శక్తి గురించి అవగాహన కల్పించారు. ఐటిడిఎ స్పోర్ట్స్ ఇంచార్జ్ ఎన్.జాకబ్ దయానంద్ మాట్లాడుతూ వ్యాయామం గురించి ఫిజికల్ ఫిట్నెస్ దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శిక్షణలో ఎటిడబ్ల్యుఒ కృష్ణవేణి, పిఎంఆర్‌సి సిబ్బంది, ఎఎంఒ కోటి బాబు, రాములమ్మ, ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్, సుబ్బారావు, నారాయుడు తదితరులు పాల్గొన్నారు
విచారణ వేగవంతం : పిఒ
బోగస్ ధ్రువపత్రాలపై విచారణను వేగవంతం చేస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. శనివారం డిఎల్‌ఎస్‌సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించారు. మరిన్ని ఆధారాలను తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఎపిఒ రోసిరెడ్డి, డిడి మంగవేణి, సిబ్బంది పాల్గొన్నారు.










