ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులోని ఆయన కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. వేడుకలకు కొండపి నియోజకవర్గం లోని 6 మండలాల నుంచి కార్యకర్తల భారీగా తరలి వెళ్లి మాగుంటకు జన్మ శుభాకాంక్షలు తెలిపారు. మాగుంటకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్‌రావు, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్ బాబు, వైసిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, వైసిపి రాష్ట్ర నాయకులు తాటిపర్తి చంద్రశేఖర్, ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, సర్పంచులు, వైసిపి మైనార్టీ సెల్ నాయకులు షేక్ సుల్తాన్, బీసీసెల్ నాయకులు కుంచాల సాయి వేణు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కనిగిరి : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టిన రోజు వేడుకలో ఒంగోలులో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి , పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వైఎం. ప్రసాద్ రెడ్డి పాల్గొని మాగుంట శ్రీనివాసులరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాగుంటకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో సర్పంచులు ముద్దా బాబు, దమ్ము వెంకటయ్య , రవీంద్ర రెడ్డి, వైసిపి నాయకులు వీరం రెడ్డి బ్రహ్మారెడ్డి, మూలే గోపాల్ రెడ్డి , మస్తాన్, శివా రెడ్డి, అమర్ నాథ్ , చైతన్య , నరేంద్ర తదితరులు ఉన్నారు.










