Aug 16,2023 20:00

మంత్రి బుగ్గన చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న ఎంపిడిఒ

ప్రజశక్తి-ఆలూరు
ఆలూరు ఎంపిడిఒ అల్లాబకాష్‌ జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ఆయా మండల అధికారులకు కలెక్టర్‌ సృజన, జడ్‌పి ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆలూరు ఎంపిడిఒ అల్లాబకాష్‌కు అవార్డు రావడంతో బుధవారం మండల కార్యాలయ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.