ఎంఈఓని సస్పెండ్ చేయాలి : ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి - ఆత్మకూర్
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్ముకుంటున్న ఎంఈఓపై చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దినేష్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక ధనుంజయ మీటింగ్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యాశాఖలో పని చేస్తూ ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను అమ్ముకుంటూ,విద్యను వ్యాపారంగా మార్చిన ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారిని వెంటనే విధులను తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే దినేష్ కుమార్ డిమాండ్ చేశారు:ప్రభుత్వ పాఠశాలల్లోచదివే పేద, బడుగు,బలహీనవర్గాల విద్యార్థులకు జగనన్న విద్యాకానుక లో భాగంగా ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ మరోపక్క దారి పడుతున్న ఉచిత పాఠ్య పుస్తకాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారన్నారు . గతంలో ఎస్ఎఫ్ఐ గా ఉన్నతాధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదని వారు అన్నారు.2023.. 24 విద్యా సంవత్సరం కు సంబంధించి ఇంకా 30 శాతం పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందలేదు. గత విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాలు తీసుకొని తిరిగి ఈ విద్యా సంవత్సరం పాత పుస్తకాలు పంచుతున్న ప్రధానోపాధ్యాయులు. విద్యాశాఖ అధికారి స్కూల్ హెచ్ఎం లకు లోబడి ,ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను అమ్ముకుంటున్న విద్యాశాఖ అధికారి వెంటనే సస్పెండ్ చేయాలని వారన్నారు. పక్కదారి పడుతున్న ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాలు. ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలు ప్రవేట్ పాఠశాలలకు అమ్మకానికి తరలిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు ఇంత జరుగుతున్న జిల్లా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా వారు డిమాండ్ చేశారు.యదేచ్చగా వారం రోజుల నుంచి ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వ ఉచిత , పాఠ్యపుస్తకాల అక్రమ రవాణాకు సహకరించిన ఇద్దరు సిఆర్పిలు, పవిత్రమైన విద్యాశాఖలో పని చేస్తూ,ఉచిత పాఠ్యపుస్తకాలను అమ్ముకుంటూ విద్యను వ్యాపారంగా మార్చిన ఆ అధికారిపై జిల్లా విద్యాశాఖ అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారు విచారణ చేపట్టి ఆత్మకూరు మండల విద్యాశాఖ అధికారిని విధుల నుంచి తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు అన్నారు .ఈ సమావేశంలో నాయకులు ప్రేమ్. దిలీప్.గంగాధర్.లింగేష్ .సాయి రాజేష్ .వెంకటరెడ్డి .రాము తదితరులు పాల్గొన్నారు










