ఎంఎల్‌ఎ వెంటే రౌడీమూకలు
ప్రజాశక్తి-కావలి : గూండాయిజం, రౌడియింజం చేసే వ్యక్తులు ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి వెంటే ఉన్నారని జనసేన పార్టీలో కానీ, జనసేన నేతలు కానీ ఎవరూ లేరని జనసేన కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అళహరి సుధాకర్, జిల్లా కార్యదర్శి సమ్మను వెంకటసుబ్బయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి రుషికేష్, పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయివిఠల్, నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తిరుమలశెట్టి సుధాకర్ ఆరోపించారు. సోమవారం పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కావలిలో జరిగిన ఆర్‌టిసి బస్సు డ్రైవర్‌పై దాడి ఘటనలో జనసేన, టిడిపి, బిజెపి పార్టీ వారిపై ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్ రెడ్డి నిందలు వేశారని తెలిపారు. గూండాయిజం, రౌడీయిజం చేసే వారు ఎంఎల్‌ఎ వెనుకనే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్‌ఎ ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. జనసేన పట్టణ గౌరవ అద్యక్షుడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు ఆలా శ్రీనాధ్, నాగార్జున, శ్రీను, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.










