Sep 01,2023 22:52

ప్రజాశక్తి-మోపిదేవి : కాల్వ చివర ఉన్న వరి పొలాలకు నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నీటిని అందింది పంటలను కాపాడాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చౌటపల్లి .రవి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మోపిదేవి మండలం చిరువోలు గ్రామంలో పంట పొలాలను సిపిఎం బందం పరిశీలించింది. తక్షణమే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సాగునీరు అందక కొన్నిచోట్ల నాట్లు వేయని పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి సముద్ర తీర మండలాలైన మోపిదేవి, నాగాయలంక కోడూరుమండలాల్లో సాగుకు సరిపోను నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మోపిదేవి మండల కార్యదర్శి బండి .ఆదిశేషు సిపిఎం మండల కమిటీ సభ్యులు కర్ర వెంకటేశ్వరరావు ,బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.