Sep 14,2023 21:00

సంఘీభావం తెలిపిన భూపాల్‌ చౌదరి

ప్రజాశక్తి - ఆదోని
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని ఎంఎస్‌పి, ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో ఆదోనిలోని భీమాస్‌ సర్కిల్‌ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. టిడిపి జిల్లా పార్లమెంట్‌ కార్యదర్శి భూపాల్‌ చౌదరి దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. న్యాయమైన ఎస్సీ వర్గీకరణకు బిజెపి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని కోరారు. దీక్షల్లో ఎంఎస్‌పి జిల్లా కో కన్వీనర్‌ బండారి హనుమంతు మాదిగ, జిల్లా నాయకులు ఇస్వి నాగప్ప మాదిగ, జిల్లా నాయకులు పిఎస్‌.వీరేష్‌ మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షులు బండారి గిడ్డయ్య మాదిగ, ఎంఆర్‌పిఎస్‌ మాజీ అధ్యక్షులు ఎం.జగన్‌ మాదిగ కూర్చుకున్నారు. టిడిపి నాయకులు తిమ్మప్ప, వాల్మీకి వెంకటేష్‌, జగదీష్‌ సంఘీభావం తెలిపారు.