Oct 22,2023 23:05

పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి

ప్రజాశక్తి-శింగరాయకొండ : దసరా నవరాత్రుల సందర్భంగా శింగరాయకొండలోని జాలమ్మ తల్లి ఆలయాన్ని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదివారం సందర్శించారు. సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహకులు దాసరి యానాదిరావు, టిడిపి నాయకులు చీమకుర్తి కృష్ణ, కూనపురెడ్డి వెంకటసుబ్బారావు, ఇమ్మడిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.